Monday, January 12, 2009

తిట్టు తిట్టు తిట్టు.కాం

>>ఛిట్లిపోయిన చిటికిన వేలుకి వేలు ఖర్చుపెట్టి Nail Art చేయించుకునె ఫ్యాషనబుల్ ఎదవ!!
>>ఫిచుక గుడ్లను దొంగలించి Maggiలో వేసుకొని తినే నీచ నికృష్టపు ఎదవ!!
>>దోమలని కిలో లెక్కలో పాకిస్థాన్ నుండి భారతదేశానికి దిగుమతి చేసే ఉగ్రవాది ఎదవ!!
>>ఆఫీసులో కాఫీ ఫ్రీ యే కదా అని ఫ్లాస్క్ తీసుకొని వెళ్ళే పీనాసి వెధవ!!
>>Samshabad విమానాశ్రయంలో అమెరికా వెళ్ళే విమానం దగ్గర run way మీద విమానం horn కొట్టెదాక చుట్ట కాల్చుకునె మొహమా!!
>>ఆదివారం రాత్రి పబ్ కి వెళ్ళి వేడిగా ఉప్మా ఉందా అని అడిగేటి సన్యాసి
>>శనివారం , ఆదివారం ఆఫీసులో కూర్చొని సోమవారం సెలవు కావాలి అని అడిగె పీనుగ...
>>CDలో virus ఉంటే Surf Excelతో ఉతుక్కునే ఉతికిస్ట్ వెధవ
>>హుస్సేన్ సాగర్ లో చేపలు పట్టి కిలో 200/- కి అమ్మే కక్కుర్తి వెధవ !!
>>బందరు లడ్డు కోసం కోతులని (బందర్) వేటాడే పనికిమాలిన మొహం నువ్వు!!
>>ప్రేమ లో "పడ్డాను" అని ఆఫీసులో Sick leave తీసుకునే సిగ్గులేని మొహము నువ్వూను!!
>>కుక్కకి డాగ్ ఫుడ్ పెట్టే ముందు కూడా రుచి చూసి పెట్టే అతి జాగ్రత్త మొహము నువ్వూను!!
>>దశావతారం సినిమా చూసి inspire అయ్యి virus ఉన్న PCలని సముద్రం లో ముంచే మొహమా!!
>>ఫక్కింటోడి పెళ్ళాం మీద అలిగే దిక్కుమాలిన వాడా
>>డాక్టరు fiber ఉన్న ఫుడ్ తినమంటే కోడి బొచ్చు తో కూర వండుకు తినే బొచ్చు గాడా
>>జీబ్రా క్రాసు జీబ్రాలు క్రాస్ చెయ్యటానికి అని ఎక్కడ పడితె అక్కడ అడ్డదిడ్డంగా రోడ్డు క్రాసు చేసే అంగర వంగర తింగర మొహమోడా..!!

నన్ను తిట్టకండేం..!!

మీ
సంకీర్తన

Friday, January 2, 2009

కబుర్లు

అందరికీ నమస్కారము!
నా పేరు సంకీర్తన.Freidns కీర్తన అని పిలుస్తారు.
ఇదే నా మొదటి బ్లాగు
కొత్త సంవత్సరంలో నెర్చుకున్న కొత్త అలవాటు.
ఈ బ్లాగు ద్వారా నాకు తెలిసిన విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను.